గ్రామపంచాయతీలుగా మారనున్న తండాలు
ప్రతిపాదనలను సిద్ధం చేయాలని
అధికారులకు మంత్రి జూపల్లి ఆదేశం
సాక్షి, హైదరాబాద్: తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన పం చాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై ఉన్నతాధికారులతో గురువారం సచివాలయంలో సమీక్షించారు.
14 వ ఆర్థిక సంఘం ద్వారా పంచాయతీలకు కేంద్రం నుంచి అందాల్సిన రూ.900 కోట్ల నిధులను పొందేందుకు చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్ డైరెక్టర్ నీతూ కు మారి ప్రసాద్‌కు సూచిం చారు. ఉపాధిహామీ, పంచాయతీపనుల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచేందుకు కొత్త సాంకేతిక వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. రూర్బన్ మిషన్ రెండో విడత ప్రతిపాదనలపై ఆయన ఆరాతీశారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ప్ర త్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్, ఇంజనీర్ ఇన్ చీఫ్ సత్యనారాయణరెడ్డి, జాయింట్ కమిషనర్లు బి.సైదులు, ఎస్‌జే ఆషా పాల్గొన్నారు.