సికింద్రాబాద్లోని చిలకలగూడ రైల్వే క్వార్టర్స్ సమీపంలో దారుణం జరిగింది. ఓ యువతిపై కొంతమంది గుర్తు తెలియని దుండగులు కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఆమెకు తీవ్రగాయాలు కావడంతో వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇంట్లో ఉన్న ఆమె మంటలతోనే వీధిలోకి కేకలు పెడుతూ వచ్చిందని, దాంతో చుట్టుపక్కల వారు మంటలు ఆర్పే ప్రయత్నం చేసి, తర్వాత ఆమెను ఆస్పత్రికి తరలించారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
యువతిపై అత్యాచార ప్రయత్నం చేసి ఉంటారని, ఆమె ప్రతిఘటించడం వల్లనే ఈ ఘోరానికి పాల్పడొచ్చని పోలీసులు అంటున్నారు. ఆమెకు కాలిన గాయాలు ఎక్కువగా ఉండటంతో, కోలుకునే అవకాశాలు అంతగా లేవని వైద్యవర్గాల ద్వారా తెలుస్తోంది. కానీ ఎంత శాతం కాలిన గాయాలయ్యయనే విషయాన్ని మాత్రం వారు నిర్ధారించడం లేదు.
యువతిపై కిరోసిన్ పోసి.. నిప్పంటించిన దుండగులు
Published Wed, Jan 29 2014 4:41 PM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM
Advertisement
Advertisement