ముగ్గురు పిల్లలతో సహా సాగర్ లో దూకిన మహిళ | mother and 3 kids suicide attempt at hussain sagar in hyderabad | Sakshi
Sakshi News home page

ముగ్గురు పిల్లలతో సహా సాగర్ లో దూకిన మహిళ

Published Sun, May 29 2016 4:31 PM | Last Updated on Mon, Sep 4 2017 1:12 AM

mother and 3 kids suicide attempt at hussain sagar in hyderabad

హైదరాబాద్: తన ముగ్గురు పిల్లలు సహా ఓ తల్లి హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మల్కాజ్గిరికి చెందిన అవినాష్, జసంత ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వీరికి సంతానం ముగ్గురు కాగా, అందరూ ఆడపిల్లలే పుట్టారన్న సాకుతో భర్త ఆమెను వదిలేశాడు. దీంతో ఏం చేయాలో పాలుపోలేదని ముగ్గురు పిల్లలతో సహా జసంత సాగర్ లో దూకి ఆత్మహత్యాయత్నం చేయగా, లేక్ పోలీసులు వారిని కాపాడారు. ఇదే విషయంపై ఆమె ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement