నల్లధనంతో కాంగ్రెస్‌కు అవినాభావ సంబంధం
బీజేపీ నేత మురళీధర్‌రావు ఆరోపణ
సాక్షి, హైదరాబాద్: నల్లధనంతో కాంగ్రెస్‌పార్టీకి అవినాభావ సంబంధముందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీ ధర్‌రావు ఆరోపించారు. దేశంలో నల్లధనం పెరగడానికి కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని, నల్లధనంపై యుద్ధం ప్రకటించడానికి ఆ పార్టీ ఏనాడూ సాహసించలేదన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రెండో అడుగు బినామీలపైనే అని ఆయన హెచ్చరించారు. నల్లధనానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఏకై క పార్టీ బీజేపీ అని, రాబోయే రోజుల్లో నల్లధనంపై యుద్ధం అనేక రూపాల్లో ఉంటుందని చెప్పారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, నల్లధనం వర్సెస్ వైట్ ఎకానమీ పద్ధతిలో ముందుకెళతామన్నారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఆకస్మి కంగా, అనుకోకుండా తీసుకున్న నిర్ణయం కాదన్నారు.