చిక్కడపల్లి,కవాడిగూడ,ఉస్మానియాయూనివర్సిటీ,న్యూస్‌లైన్: ఆంక్షల్లేని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని, తెలంగాణ ఏర్పాటుకు పోలవరం ప్రాజెక్టుకు సంబంధం ఏమిటని తెలంగాణ ప్రజాఫ్రంట్ నేతలు ప్రశ్నించారు. యూపీఏ,ఎన్‌డీఏ, టీఆర్‌ఎస్‌లు రాజకీయ లబ్ధికోసం తెలంగాణను ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారని తెలంగాణ ప్రజాఫ్రంట్ ఉపాధ్యక్షు డు వేదకుమార్ విమర్శించారు. తెలంగాణ ఏర్పాటు, పోల వరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఫ్రంట్ ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్కు వద్ద ధ ర్నా జరిగింది. ఈసందర్భంగా వేదకుమార్ మాట్లాడారు. ‘తెలంగాణ ఏర్పాటు కోసం ఉన్న 12 ఆంక్షలను ఎత్తివేయాలి. మానవవిధ్వంసం చేసే పోల వరం ప్రాజెక్టును వెంటనే నిలిపేయాలి. హైకోర్టు తెలంగాణేకే ఉండాలి. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంశం. గవర్నర్ పెత్తనాన్ని తొలగించాలి. ఎలాంటి ఆంక్షల్లేని,సంపూర్ణ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని’డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రధానకార్యదర్శి నలమాస కృష్ణ, కార్యదర్శి చిక్కుడు ప్రభాకర్, అల్లం పద్మ తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో హల్‌చల్ : షరతుల్లేకుండా తెలంగాణ ఇవ్వాలని, సీమాంధ్రనేతలు కుట్రలు ఇక సాగవంటూ..ప్రజాఫ్రంట్ నేతలు ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో ఆందోళన నిర్విహ ం చారు. బ్యానర్లు,ప్లకార్డులు పట్టుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తుండడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈసందర్భంగా వారు సీమాంధ్ర పాలకుల్లారా ఖబడ్దార్, ఖబడ్దార్ అంటూ నినాదాలు చేస్తుండడంతో వారిని అక్కడ్నుంచి తరలించారు.
అంబేద్కర్ విగ్రహం వద్ద : పోలవరం ప్రాజెక్టుకు, తెలంగాణ ఏర్పాటుకు లింకెందుకని విరసం నేత వరవరరావు కేంద్రాన్ని ప్రశ్నించారు. బంద్‌కు మద్దతుగా విరసం ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. దీనికి ఆయన హాజరై మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ఎందుకు నిర్మాణం చేయాలని, ఆదివాసీ గ్రామాలనే ఎందుకు ముంచాలని ప్రశ్నించారు. ధర్నా చేపట్టిన విరసం నేతలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి తరలించారు.
ఓయూలో : ప్రజాసంఘాల పిలుపు మేరకు ఓయూలో బంద్ సంపూర్ణంగా జరిగింది. వివిధ విద్యార్థి సంఘాల నాయకులు కళాశాలలను, కార్యాలయాలను మూసివేయించారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల నుంచి ఎన్‌సీసీ గేటు వరకు ర్యాలీ చేపట్టగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది.
ఆంక్షల్లేని తెలంగాణ ఇవ్వండి:టీపీఎఫ్
Published Wed, Feb 12 2014 2:01 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement