ఐడీపీఎల్ కాలనీ సమీపంలోని చెట్లపొదల్లో అప్పుడే పుట్టిన ఆడశిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లారు.
ఎవరో అప్పుడే పుట్టిన శిశువును రోడ్డుపక్కన పడేసి వెళ్లారు. బాటసారులు గమనించి ఆస్పత్రికి చేర్చేలోగానే ఆ పసిగుడ్డు ఈ లోకాన్ని వీడి పోయింది. బాలానగర్‌లో గురువారం ఉదయం ఈ ఘోరం చోటుచేసుకుంది. బాలానగర్ ఐడీపీఎల్ సమీపంలోని వాటర్ ట్యాంక్ వద్ద పొదల్లో గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన శిశువును వదిలేసి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత అటుగా వెళ్లిన వారు గమనించి 108కు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని, శిశువును ఆస్పత్రికి చేర్చారు. అయితే, అప్పటికే శిశువు చనిపోయినట్లు డాక్టర్లు గుర్తించారు.