హైదరాబాద్ : 123 జీవోపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. మెదక్ జిల్లా నిమ్జ్ కోసం భూసేకరణ చేపట్టవచ్చని న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. దీంతో జీవో 123 లోపాలను సవరిస్తూ 190 జీవోను విడుదల చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం ఈ సందర్భంగా హైకోర్టుకు విన్నవించింది. ఈ మేరకు 190 అనుబంధ జీవో కాపీని న్యాయస్థానానికి సమర్పించింది. పరిశ్రమలు వచ్చేంతవరకూ బలవంతంగా రైతులను, నిర్వాసితులను ఖాళీ చేయించవద్దని హైకోర్టు... ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మెదక్ నిమ్జ్ భూసేకరణకు హైకోర్టు అనుమతి
Published Tue, Aug 16 2016 12:19 PM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM
Advertisement
Advertisement