ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన నిదా మెహ్రీన్ బైపీసీలో 994 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది.
994 మార్కులు సాధించిన నిదా మెహ్రీన్
♦ 992 మార్కులతో ఎంపీసీలో నలుగురు టాపర్లు
♦ ఎంఈసీలో 985, సీఈసీలో 967, హెచ్‌ఈసీలో 925 టాప్ మార్కులు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన నిదా మెహ్రీన్ బైపీసీలో 994 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది. ఆ తరువాత 993 మార్కులతో కరీంనగర్ జిల్లాకు చెందిన రంగు కావ్యశ్రీ, అక్కనపల్లి హర్షిణిరెడ్డి రెండో స్థానంలో నిలిచారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఎంపీసీలో అత్యధికంగా 992 మార్కులతో టాపర్లుగా నిలిచారు.
రంగారెడ్డి జిల్లాకు చెందిన పి. రాజశేఖర్‌రెడ్డి, వి.చరితరెడ్డి, రవితేజతోపాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన సంధ్యబిక్షం ప్రీతిశర్మ కూడా 992 మార్కులు సాధించారు. బైపీసీలో టాప్-14 మందిలో ఒక్క బాలుడు లేడు. కరీంనగర్ జిల్లాకు చెందిన జి. సుష్మ 967 మార్కులతో సీఈసీ టాపర్‌గా నిలవగా మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వై. సాయి కుమార్ 985 మార్కులతో ఎంఈసీ టాపర్‌గా నిలిచాడు. ఖమ్మం జిల్లాకు చెందిన ఎం. స్నేహ 925 మార్కులతో హెచ్‌ఈసీ టాపర్‌గా నిలిచింది.