ప్రాజెక్టుల్లో అవినీతి సహించేది లేదు : ఉత్తమ్, మల్లు రవి
టీపీసీసీ నేతలు ఉత్తమ్, మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టులను నిర్మించాలని కోరుతున్నామని, అయితే అందులోని అవినీతిని సహించేది లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవితో కలసి గాంధీభవన్‌లో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు వాస్తవాలను దాచిపెట్టి అబద్ధా లు చెబుతున్నారన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచడం, కాంట్రాక్టర్లతో కలిసి కమీషన్లు పంచుకోవడానికి తాము వ్యతిరేకమన్నారు. రాష్ట్రంలో సాగునీరు, తాగునీరు, అభివృద్ధికి ప్రాజెక్టులు కట్టాల్సిం దేనన్నారు. మల్లు మాట్లాడుతూ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కాంగ్రెస్ హయాం లోనే ప్రతిపాదనలు పూర్తయ్యాయన్నారు. కాంగ్రెస్ ఇప్పుడు అడ్డుపడుతున్నదని హరీశ్‌రావు అబద్ధాలాడటం మంచిది కాదన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి సర్వే, డీపీఆర్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వమే ఏడున్నర కోట్లను ఖర్చు పెట్టిందన్నారు.
వైఫల్యాలను దాచుకోవడానికే...
రెండేళ్ల పాలనలో వైఫల్యాలను దాచుకుని, ప్రజల దృష్టిని మళ్లించడానికే సోనియాగాంధీపై బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందని ఉత్తమ్ అన్నారు. అగస్టా హెలీకాప్టర్ల కొనుగోలు విషయంలో యూపీఏ ప్రభుత్వం ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదన్నారు. ఆ కేసుతో సోనియాగాంధీకి ఎలాంటి సంబంధమూ లేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.