దిగ్విజయ్‌ను కోరిన ఓయూ, తెలంగాణ విద్యార్థి జేఏసీ
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తమకు 10 శాతం సీట్లు కేటాయించాలని తెలంగాణ విద్యార్థుల జేఏసీ, ఓయూ జేఏసీ.. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల పరిశీల కులు దిగ్విజయ్‌సింగ్‌ను కోరింది. శనివారం గాంధీభవన్‌కు భారీగా తరలివచ్చిన విద్యార్థి నేతలు టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సహా నేతలందరికీ విజ్ఞప్తులందించారు. తెలంగాణ నిర్మాణంలో తాము కూడా కీలక పాత్ర పోషిస్తామని, అందుకోసం ఎమ్మెల్యే/ఎంపీసీట్లలో తమకు పదిశాతం కేటాయిం చాలని ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గాంధీభవన్‌లో విద్యార్థులు జెతైలంగాణ, జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో పొన్నాల అటుగా వస్తుంటే విద్యార్థులు ఆయన్ను చుట్టుముట్టారు. తమడిమాండ్లను ఏకరువు పెట్టారు. ఇందుకు పొన్నాల స్పందిస్తూ టికెట్ల విషయంలో విద్యార్థి నేతల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుంటామని మీడియాకు తెలిపారు. విజ్ఞప్తులు అందజేసిన వారిలో విద్యార్థి జేఏసీ చైర్మన్ యల్లన్న, అధికార ప్రతినిధిబాలలక్ష్మి, కన్వీనర్ దుర్గం భాస్కర్, వేల్పుల సంజయ్, రాములు తదితరులున్నారు.
దిగ్విజయ్ అసహన ం: పది శాతం సీట్ల డిమాండ్‌తో విద్యార్థి నేతలు గాంధీభవన్ ఎదుట నినాదాలు చేపట్టారు. అదే సమయంలో దిగ్విజయ్‌సింగ్ అటుగా రావడంతో ఆయన్ను చుట్టుముట్టేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. దీంతో డిగ్గీ అసహనానికి గురై వినతిపత్రం తీసుకోకుండానే లోపలకు వెళ్లిపోయారు. పొన్నాల దృష్టికి కూడా ఈ విషయం రావడంతో ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. కొద్దిసేపటి తరువాత పోలీసుల సహాయంతో విద్యార్థుల్ని లోపలికి అనుమతించిన పొన్నాల వారితో మాట్లాడారు.
మాకు పది శాతం సీట్లివ్వండి
Published Sun, Mar 16 2014 2:49 AM | Last Updated on Tue, Aug 14 2018 3:55 PM
Advertisement