కేసీఆర్ రెండేళ్ల పాలనకు వ్యతిరేకంగా... జూన్ 1వ తేదీన 'కేసీఆర్ పాలన- విముక్తి' అనే పేరుతో విద్యార్థి పోరు గర్జన నిర్వహిస్తున్నట్లు ఓయూ జేఏసీ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆహ్వానించారు. రాష్ట్రంలోని అన్ని ప్రతిపక్ష పార్టీల నేతలతో పాటు ప్రజాసంఘాల నేతలు గద్దర్, సాయిబాబా తదితర ముఖ్యనేతలను ఈ సభకు అహ్వానిస్తున్నట్లు పీడీఎస్‌యూ నేత మానవతారాయ్ చెప్పారు.
రెండేళ్ల కేసీఆర్ పాలనలో విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలు చేయలేదని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు. తెలంగాణ అవిర్భావ దినోత్సవం సందర్బంగా ప్రభుత్వం చేస్తున్న సంబరాలకు వ్యతిరేకంగా ఒకరోజు ముందు సాయంత్రం ఓయూ ఆర్ట్స్ కాలేజీ దగ్గర ఈ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసిన వారిలో పీడీఎస్‌యూ నేతలు మానవతారాయ్, దయాకర్, ఏఐఎస్ఎఫ్ నేత కోట శ్రీనివాస్ గౌడ్, టీవీఎస్ నేత ఆర్ ఎస్ శంకర్, టీవీవీ నేత నాగేశ్వర్ రావు, బద్రి, డీఎస్‌యూ నేతలు రంజిత్, తిమ్మిడి నాగరాజు, నజీర్, రెహ్మాన్, రమేష్, మూర్తి ఉన్నారు.
జూన్ 1న ఓయూలో విద్యార్థి గర్జన సభ
Published Thu, May 26 2016 8:10 PM | Last Updated on Fri, Nov 9 2018 4:46 PM
Advertisement