మేడ్చల్: హైదరాబాద్ శివార్లలో కోడిపందేల స్థావరంపై ఎస్‌ఓటీ పోలీసులు సోమవారం దాడి చేశారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగాపూర్ తండాలో కొంతకాలంగా కోడి పందేలు నిర్వహిస్తున్నారు. దీనిపై పక్కా సమాచారంతో పోలీసులు ఓ ఫాంహౌజ్పై దాడి చేసి కోడిపందాలు నిర్వహిస్తున్న 8 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 8 సెల్‌ఫోన్లు, 4 కోళ్లు, 8 కత్తులతో పాటు రూ.25,230 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఫాంహౌజ్ యాజమన్యంతో పాటు పందేలకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.