యాకుత్‌పురా (హైదరాబాద్) : కళాశాలకని బయటకు వెళ్లిన ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. మీర్‌చౌక్ పోలీసుల వివరాల ప్రకారం.. మీరాలంమండి ఇచిబేగ్ కమాన్ ప్రాంతానికి చెందిన మహ్మద్ షాహజూర్ కుమారుడు మహ్మద్ ఫారూఖ్ అలియాస్ షోహేబ్ (17) సంజయ్ గాంధీ మెమోరియల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుకుంటున్నాడు. ఈ నెల 13న ఫారూఖ్ కళాశాలకని ద్విచక్ర వాహనంపై ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్థానిక ప్రాంతాలు, స్నేహితులు, బంధువుల వద్ద వాకబు చేయగా ఫలితం లేకుండా పోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.