వారానికోసారి నీళ్లిస్తున్నారు
హైదరాబాద్: నీటిఎద్దడితో ప్రొద్దుటూరులో తీవ్రమైన ఇబ్బంది పడుతున్నామని వైఎస్ఆర్ సీపీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. మంగళవారం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జీరో అవర్లో ఆయన మాట్లాడుతూ.. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ వాళ్లు వారానికి ఒకసారి నీళ్లిస్తున్నారని చెప్పారు.
'18 కోట్ల రూపాయలతో వరద కాలువను పెన్నాకు అనుసంధానం చేసే పనులు మొదలుపెట్టారు. రైతులు కోర్టుకు వెళ్లడంతో పనులు పూర్తి కాలేదు. అనుసంధానం పూర్తయితే ప్రొద్దుటూరుకు నీటి సమస్య తీరుతుంది. ఇటీవల మంత్రి దేవినేని ఉమా కూడా వచ్చారు. ఆ పనులు ఎప్పటిలోగా పూర్తిచేస్తారు' అని రాచమల్లు ప్రసాదరెడ్డి ప్రశ్నించారు.