పుష్పక్ బస్సు దగ్ధం.... ప్రయాణికులు క్షేమం | Pushpak rtc bus catches fire in hyderabad | Sakshi
Sakshi News home page

పుష్పక్ బస్సు దగ్ధం.... ప్రయాణికులు క్షేమం

Published Tue, Jul 29 2014 8:43 AM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM

పుష్పక్ బస్సు దగ్ధం.... ప్రయాణికులు క్షేమం - Sakshi

పుష్పక్ బస్సు దగ్ధం.... ప్రయాణికులు క్షేమం

హైదరాబాద్ : పుష్పక్ ఆర్టీసీ బస్సులో సోమవారం అర్థరాత్రి మంటలు చెలరేగాయి. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించటంతో ప్రయాణికులు సురక్షింగా బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే  అయిదుగురు ప్రయాణికులతో శంషాబాద్ విమానాశ్రయానికి వెళుతున్నపుష్పక్ బస్సులో  ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గత రాత్రి 11 గంటల సమయంలో సికింద్రాబాద్ నుంచి శంషాబాద్ వెళ్తున్న  ఈ బస్సు ఆరాంగడ్ చౌరాస్తా దాటి కొద్ది దూరం వెళ్లగానే వెనక ఇంజన్ నుంచి మంటలు రావటాన్ని డ్రైవర్ గమనించాడు.

దాంతో వెంటనే బస్సును ఆపివేశాడు. బస్సులో ఉన్న ప్రయాణికులంతా సురక్షితంగా కిందికి దిగారు. ఆ వెంటనే మంటలు వ్యాపించి బస్సుంతా పూర్తిగా తగలబడిపోయింది. రెండు ఫైరింజన్లు ఘటనాస్థలానికి చేరుకునే సరికే బస్ పూర్తిగా దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.  డ్రైవర్‌ అప్రమత్తతతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement