గీత దాటితే కొరడా బస్సులపై ఆంక్షలు | Restrictions to private Buses | Sakshi
Sakshi News home page

గీత దాటితే కొరడా బస్సులపై ఆంక్షలు

Published Wed, Aug 7 2013 2:39 AM | Last Updated on Fri, Sep 1 2017 9:41 PM

సైబరాబాద్‌లో గాడి తప్పుతున్న ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ప్రైవేట్ బస్సులపై ఆంక్షలు విధించారు. నడిరోడ్డుపై బస్సులు

సైబరాబాద్‌లో గాడి తప్పుతున్న ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ప్రైవేట్ బస్సులపై ఆంక్షలు విధించారు. నడిరోడ్డుపై బస్సులు నిలుపుతూ గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రాఫిక్ డీసీపీ అవినాష్ మహంతి వెల్లడించారు. మంగళవారం తన కార్యాల యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట్రాఫిక్‌పై తీసుకుంటున్న చర్యలను ఆయన సుదీ ర్ఘంగా వివరించారు. సైబరాబాద్‌లోని బాలానగర్, జేఎన్టీయూ, కూకట్‌పల్లి, గచ్చిబౌలి, మియాపూర్, ఉప్పల్, నాచారం, మల్కాజిగిరి, ఎల్బీనగర్, హయత్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, సాగర్ రహదారి తదితర ప్రాంతాల్లో ఈ మధ్య విపరీతమైన రద్దీ పెరిగింది. చాలీచాలని సిబ్బందితో ట్రాఫిక్ పోలీ సులు నానాఅవస్థలకు గురవుతున్నారు.కొన్ని సందర్భాల్లో వాహనదారులు, పోలీసులు గొడవపడిన ఘటనలు అనేకం. 
 
 దీంతో ట్రాఫిక్‌ను గాడిలో పెట్టాలంటే ముఖ్యంగా వేలసంఖ్యలో పగటిపూట నడుస్తు న్న ప్రైవేటు బస్సులపై ఆంక్షలు విధించారు. ఉదయం 7 నుంచి 12 వరకు..మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ బస్సులపై ఆంక్షలు ఉంటాయి. ఈసమయాల్లో బస్సులు తిప్పాలంటే తప్పనిసరిగా పోలీసుల అనుమతి అవసరం. ప్రతి ట్రాఫిక్ పోలీసుస్టేషన్‌లో ఇందుకు సంబంధించిన ఫారాలను సిద్ధం చేశారు. అనుమతి లేకుండా ఆంక్షల సమయంలో బస్సులు నడిస్తే చలానా లేదా సీజ్ చేస్తామని డీసీపీ స్పష్టంచేశారు. ఈ ఆంక్షలు ఈనెల 19 నుంచి అమల్లోకి వస్తాయన్నారు.
 
  కార్యక్రమాలకు అనుమతి తప్పనిసరి : రహదారులపై ఎక్కడబడితే అక్కడ వివిధ కార్యక్రమాలు చేపడ్తుండడంతో ట్రాఫిక్ అంతరాయం కలుగుతోంది.  షాపింగ్‌మాల్స్, ఇతర ప్రారంభోత్సవాలకు ఇకనుంచి తప్పనిసరిగా ట్రాఫిక్ పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని డీసీపీ అవినాష్ మహంతి తెలిపారు. అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహించి ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  
 
 ట్రాఫిక్ కంట్రోల్‌రూం ఏర్పాటు : సైబరాబాద్ పోలీ సు కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేకంగా కంట్రోల్‌రూం ఏర్పాటు చేశామని..వాహనదారులు సమస్యలు ఏమైనా ఉంటే 040-23002424కు ఫోన్‌చేయాలని మహంతి సూచించారు.  సిబ్బందిని గౌరవించండి : ఎండ,వాన,దుమ్ముకు రహదారిపై గంటల తరబడి విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసులను గౌరవించాల్సిన బాధ్యత వాహనదారులపై ఉందని మహంతి ఈసందర్భంగా కోరారు. నిబంధనలు పాటించడం వల్ల సిబ్బందితో వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు.  అలాగే సిబ్బంది పొరపాట్లపై ఫిర్యాదులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement