
అర్ధరాత్రి వేళ...
పచ్చదనంపై వేటు...
కేబీఆర్ పార్కు చుట్టూ మల్టీలెవల్ ఫ్లైఓవర్ పనులు షురూ...
గుట్టు చప్పుడు కాకుండా పనులు చేపట్టిన అధికారులు
బంజారాహిల్స్: కేబీఆర్ పార్కు చుట్టు నిర్మించనున్న మల్టీలెవల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను రాత్రివేళల్లో అధికారులు గుట్టుచప్పుడు కాకుండా చేపట్టారు. జూబ్లీహిల్స్‌రోడ్ నెం.45లోని బాలకృష్ణ నివాసం ఎదురుగా ఉన్న పార్కింగ్‌స్లాట్‌లో వాక్‌వేను ఆనుకొని ఉన్న గోడను పూర్తిగా కూల్చివేశారు. వీటితో పాటు గ్రిల్స్‌ను కూడా తొలగించి పక్కకు పడేశారు.
సిమెంటు దిమ్మెల నిర్మాణానికి వినియోగించే సెంట్రింగ్ పరికరాలను సమకూర్చుకొని ఇక్కడ ఉంచారు. మంగళవారం రాత్రి ఈ తంతు గమనించిన హైదరాబాద్ రైజింగ్ క్లబ్ నిర్వాహకులు ఇక్కడకు వచ్చి ఆందోళన నిర్వహించారు. పచ్చని చెట్లు తొలగించొద్దని నినదించారు.