
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో తనిఖీలు
► నల్లబెల్లం, గంజాయి స్వాధీనం
సికింద్రాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో గురువారం ఉదయం రైల్వేపోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కల్తీ సారాకు ఉపయోగించే 1500 కిలోల నల్లబెల్లం(27 సంచులు), 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వరంగల్‌కు చెందిన బీరు సునీల్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైళ్ల బోగీలను క్షుణ్ణంగా తనిఖీ చేసారు.
విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన పద్మావతి ఎక్స్ ప్రెస్ రైలులో నల్లబెల్లం, గంజాయిని గమనించి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా దక్షిణ నర్సాపూర్, చెన్నై, మచిలీపట్నం, సింహపురి, నారయణాద్రి, గోదావరి ఎక్స్‌ప్రెస్ రైళ్లలో లేడీస్ కోచ్, లగేజీ కోచ్‌లలో ప్రయాణిస్తున్న 300 మందిని పట్టుకుని కేసులు నమోదుచేశారు. అరెస్టు చేసిన వారని కోర్టుకు హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు.