మద్యం సిండికేట్ల వ్యవహారమంతా గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ) చుట్టూ తిరుగుతుంటుంది. మద్యం వ్యాపారులంతా కూటమి కట్టి మద్యం ధరలు పెంచి అమ్మడం సర్వసాధారణం. ఎక్సైజ్ ఎన్‌ఫోర్సుమెంటు అధికారులు మద్యం వ్యాపారులపై ఎమ్మార్పీ ఉల్లంఘన కేసు నమోదు చేస్తే రూ.5 లక్షల అపరాధ రుసుం (కాంపౌండింగ్ ఫీజు) చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఉన్న రూ.లక్ష వరకు ఉన్న ఈ మొత్తాన్ని రూ.5 లక్షలకు పెంచుతూ ఇటీవలే జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముసాయిదా బిల్లు ఆమోదించిన సంగతి తెలిసిందే. అయితే చట్టం చేసేందుకు ఏపీ శాసనసభ ఆమోదించాలి. దీంతో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గురువారం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే మద్యం వ్యాపారులకు విధించే అపరాధ రుసుం ఐదు రెట్లు కట్టాల్సి ఉంటుంది.
ఎమ్మార్పీకి మించితే రూ.5 లక్షల జరిమానా
Published Thu, Sep 8 2016 6:33 PM | Last Updated on Mon, Sep 4 2017 12:41 PM
Advertisement