ప్రత్యేక కోర్టును కోరిన సీఐడీ.. 24కు కేసు వాయిదా..
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ పేపర్ లీకేజీ కేసులో కీలక నిందితుడు శివబహదూర్ సింగ్ అలియాస్ ఎస్బీ సింగ్‌ను తమ కస్టడీకి అప్పగించాలని ప్రత్యేక కోర్టును సీఐడీ కోరింది. లీకేజీలో ఎస్బీ సింగ్‌ను 10 రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు శుక్రవారం విచారించింది. ‘లీకేజీకి ఎవరు కుట్రపన్నారు. ఇందుకు సహకరించిన వారెవరు. విద్యార్థుల తల్లిదండ్రులకు సంబంధం ఉందా?’ అనే విషయాలు రాబట్టేందుకు ఎస్బీ సింగ్‌ను కస్టడీలో విచారించాల్సి ఉందని సీఐడీ తరఫు న్యాయవాది నివేదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి తన నిర్ణయాన్ని ఈనెల 24న వెలువరిస్తానని పేర్కొన్నారు.
యూనివర్సిటీ నిర్లక్ష్యంపై నివేదిక
ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో జేఎన్‌టీయూ నిర్లక్ష్యంపై ప్రభుత్వానికి నివేదికివ్వాలని సీఐడీ భావిస్తోంది. 2005 నుంచి ప్రతిష్టాత్మకమైన ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాలు ఆ ప్రింటింగ్ ప్రెస్ నుంచే లీకైన విషయం తెలుసుకోకుండా ప్రింటింగ్‌కు ఇవ్వడంపై ప్రభుత్వానికి నివేదించాలని సీఐడీ అదనపు డీజీపీ గోవింద్ సింగ్ భావిస్తున్నారు.
ఎస్బీ సింగ్‌ను కస్టడీకి అప్పగించండి
Published Sat, Apr 22 2017 2:32 AM | Last Updated on Tue, Sep 5 2017 9:20 AM
Advertisement
Advertisement