మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని షీటీమ్స్ ఆధ్వర్యంలో 5కే రన్ నిర్వహించారు.
హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నేర రహిత నగరం కోసం షీటీమ్స్ ఆధ్వర్యంలో ఆదివారం 5కే, 2కే రన్ నిర్వహించారు. నక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా నుంచి ఉదయం ఈ రన్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి డీజీపీ అనురాగ్‌శర్మ ముఖ్య అతిథిగా హాజరై జండా ఊపి ప్రారంభించారు.
5కే రన్ కార్యక్రమంలో సినీతారలు అక్కినేని అమల, తాప్సితో పాటు పలువురు సెలబ్రిటీలు, యువతీయువకులు, ఔత్సాహికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రన్ సందర్భంగా ట్యాంక్‌బండ్ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.