స్టేడియంలో ‘షీ’కి చిక్కారు.. | 'She' to the riddles | Sakshi
Sakshi News home page

స్టేడియంలో ‘షీ’కి చిక్కారు..

Published Sun, May 17 2015 1:48 AM | Last Updated on Fri, Aug 17 2018 7:48 PM

స్టేడియంలో ‘షీ’కి చిక్కారు.. - Sakshi

స్టేడియంలో ‘షీ’కి చిక్కారు..

షీ టీమ్‌పై ఎదురుదాడి  యువకుల రిమాండ్
 
ఉప్పల్: ఐపీఎల్ మ్యాచ్ చూడటానికి వెళ్లిన యువకులు మద్యం మత్తులో యువతులపై అసభ్యంగా ప్రవర్తించి, షీ టీమ్‌కు చిక్కారు. ఉప్పల్ పోలీసులు తెలిపిన వివరాలు.. శుక్రవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ చూడటానికి వెళ్లిన జూబ్లీహిల్స్‌కు చెందిన విద్యార్థి వాజల రేవంత్(22), హబ్సిగూడకు చెందిన నూకల ధీరజ్‌రెడ్డి (21), కారెపు ప్రేమ్‌రాజ్(18), సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు పాములపర్తి అభిషేక్‌రెడ్డి(27), నారాయణతేజ(24)లు కార్పొరేట్ బాక్స్‌లో మద్యం సేవించారు.

అనంతరం పక్కనే మరో కార్పొరేట్ బాక్స్‌లో ఉన్న యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో అక్కడే ఉన్న షీ టీం బృందం గమనించి వీడియో తీశారు. అనంతరం యువతుల ఫిర్యాదు మేరకు వారిని షీ బృందం అదుపులోకి తీసుకుంది. ఆయితే యువకులను అదుపులోకి తీసుకున్న షీ బృందం పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించి ఎదురుదాడి చేశారు. ఆరుగురి యువకులపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement