సాక్షి,సిటీబ్యూరో: సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యమం సాగుతుండడం, ఆర్టీసీ బస్సులు పూర్తిగా నిలిచిపోవడంతో నగరం నుంచి ఆయా ప్రాంతాలకు వెళ్లే వారు రైళ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో నగరం నుంచి బయల్దేరే అన్ని రైళ్లు విపరీతమైన రద్దీతో వెళ్తున్నాయి. ఫలితంగా బెర్తుల కోసం నిరీక్షణ జాబితా (వెయిటింగ్‌లిస్టు) భారీగా పెరిగింది. ఈనేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అదనపు బెర్తులను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. వెయిటింగ్ జాబితా బాగా పెరిగిన దృష్ట్యా మొత్తం 17వేలకు పైగా అదనపుబెర్తులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ద.మ.రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు తెలిపారు. ఈ మేరకు రాజధాని నుంచి తిరుపతికి వెళ్లే దాదాపు అన్ని ప్రధాన ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అదనపు బోగీలను ఏర్పాటు చేయనున్నారు.
తిరుపతి వైపు రాకపోకలు సాగించే రైళ్లు...
సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్ నుంచి వెళ్లేటప్పుడు ఈనెల 31, సెప్టెంబర్ 1,2,5,6,7,8,9,తేదీల్లో, తిరుపతి నుంచి సికింద్రాబాద్ వచ్చేప్పుడు సెప్టెంబర్ 1,2,3,6,7,8,9,10 తేదీల్లో రెండు స్లీపర్‌క్లాస్ బోగీలను అదనంగా ఏర్పాటు చేశారు.
సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ (12731/12732)లో సెప్టెంబర్ 3,4 తేదీల్లో,తిరిగి తిరుపతి నుంచి 4,5 తేదీల్లో రెండు స్లీపర్‌క్లాస్ బోగీలు అదనం.
హైదరాబాద్-తిరుపతి-హైదరాబాద్ రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ నుంచి వెళ్లేటప్పుడు ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 10 వరకు తిరుపతి నుంచి వచ్చేటప్పుడు సెప్టెంబర్ 1 నుంచి 11 వరకు ఒక స్లీపర్‌క్లాస్ అదనం.
సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే సెవెన్‌హిల్స్ ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్ నుంచి సెప్టెంబర్ 3,7 తేదీల్లో, తిరుపతి నుంచి సెప్టెంబర్ 6,8 తేదీల్లో ఒక అదనపు స్లీపర్‌క్లాస్ అదనం.
తిరుపతి-కరీంనగర్-తిరుపతి (12761/12762) వీక్లీఎక్స్‌ప్రెస్‌లో తిరుపతి నుంచి సెప్టెంబర్ 4న, కరీంనగర్ నుంచి 5న ఒక స్లీపర్‌క్లాస్ అదనంగా ఏర్పాటు చేశారు.
తిరుపతి-ఆదిలాబాద్ మధ్య నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో సెప్టెంబర్ 1 నుంచి 11 వరకు రెండు వైపులా ఒక అదనపు స్లీపర్‌క్లాస్ బోగి ఉంటుంది.
ఇతర మార్గాల్లో....
కాచిగూడ-యశ్వంత్‌పూర్-కాచిగూడ (17603/17604) ఎక్స్‌ప్రెస్‌లో కాచిగూడ నుంచి వెళ్లేటప్పుడు ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 10 వరకు, యశ్వంత్‌పూర్ నుంచి వచ్చేప్పుడు సెప్టెంబర్ 1 నుంచి 11 వరకు ఒక స్లీపర్‌క్లాస్ బోగీ అదనం.
తిరుపతి-మచిలీపట్నం-తిరుపతి (17401/17402) ఎక్స్‌ప్రెస్‌లో తిరుపతి నుంచి ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 10 వరకు, మచిలీపట్నం నుంచి సెప్టెంబర్ 1 నుంచి 11 వరకు ఒక స్లీపర్‌క్లాస్ అదనం.
కాకినాడ-బెంగళూరు మధ్య నడిచే శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌లో కాకినాడ నుంచి వెళ్లేటప్పుడు సెప్టెంబర్ 1 నుంచి 10 వరకు, తిరిగి వచ్చేప్పుడు సెప్టెంబర్ 2 నుంచి 11 వరకు ఒక ఏసీత్రీటైర్, ఒక స్లీపర్ క్లాస్ అదనం.
హైదరాబాద్-త్రివేండ్రం మధ్య నడిచే శబరి ఎక్స్‌ప్రెస్‌లో సెప్టెంబర్ 1 నుంచి 10 వరకు, తిరుగు ప్రయాణంలో 3 నుంచి 12 వరకు ఒక ఒక ఫస్ట్ ఏసీ బోగీ అదనం.
కాచిగూడ-చిత్తూరు మధ్య నడిచే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో సెప్టెంబర్ 1 నుంచి 11 వరకు రెండు వైపులా ఒక సెకెండ్ ఏసీ అదనంగా ఏర్పాటు చేశారు.
నాందేడ్-ముంబయి మధ్య నడిచే తపొవన్ ఎక్స్‌ప్రెస్‌లో సెప్టెంబర్ 1 నుంచి 11 వరకు రెండు వైపులా ఒక ఏసీ చైర్‌కార్ అదనం.
ధర్మాబాద్-మన్మాడ్ మధ్య నడిచే మరఠ్వాడా ఎక్స్‌ప్రెస్‌లో సెప్టెంబర్ 1 నుంచి 10 వరకు రెండు వైపులా ఒక ఏసీ చైర్‌కార్ అదనం.
సికింద్రాబాద్ -రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్ నుంచి సెప్టెంబర్ 2, 3,9,14 తేదీల్లో ,రాజ్‌కోట్ నుంచి సెప్టెంబర్ 4,5,11.16 తేదీల్లో ఒక థర్డ్ ఏసీ అదనంగా ఏర్పాటు చేశారు.
సికింద్రాబాద్-సాయినగర్ మధ్య నడిచే షిర్డీ ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్ నుంచి సెప్టెంబర్ 6,13 తేదీల్లో, సాయినగర్ నుంచి సెప్టెంబర్ 7, 14 తేదీల్లో ఒక థర్డ్ ఏసీ అదనం.