ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో అవినీతి లేదనేది అర్ధరహితమని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి విమర్శించారు.
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో అవినీతి లేదనేది అర్ధరహితమని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి విమర్శించారు. ఎంతోమంది మంత్రులు, బీజేపీ నేతలు అవినీతిలో కూరుకుపోయారని ఆయన మండిపడ్డారు. బుధవారం సురవరం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, మంత్రులపై వ్యాపం కుంభకోణంలో ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. కర్ణాటకలో యడ్యురప్ప, మహారాష్ట్రలో ఎకనాథ్ ఖడ్సే అవినీతిలో కురుకుపోయారని తెలిపారు. అనుకూల మీడియాతో ప్రజాదరణ పెరిగిందని నరేంద్ర మోదీ చెప్పుకుంటున్నారని సురవరం సుధాకర్ రెడ్డి విమర్శించారు.