ప్రయాణికులకు భద్రతతో కూడిన మెరుగైన రవాణా, వసతి సౌకర్యాల్ని కల్పించాల్సిన గురుతర బాధ్యత రైల్వే సిబ్బందిపై ఉందని రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభు పేర్కొన్నారు.
సిబ్బందికి సందేశం పంపిన రైల్వేశాఖ కొత్త మంత్రి సురేశ్ ప్రభు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులకు భద్రతతో కూడిన మెరుగైన రవాణా, వసతి సౌకర్యాల్ని కల్పించాల్సిన గురుతర బాధ్యత రైల్వే సిబ్బందిపై ఉందని రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభు పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు రైల్వే చేదోడువాదోడుగా ఉందన్న విషయాన్ని గుర్తించి ప్రతిఒక్కరూ సమర్థంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రైల్వేశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి ఆయన అన్ని రైల్వే జోన్లకు సందేశాన్ని పంపారు. రైల్వేను సమూలంగా మార్చాలని భావిస్తే ముందుగా ప్రతి రైల్వేఉద్యోగి తనకుతాను మారాల్సి ఉంటుందని సూచించారు. మంత్రి పంపిన సందేశాన్ని దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ సిబ్బందికి పంపిణీ చేసి అమలు చేయాల్సిందిగా ఆదేశించారు.