
ఉద్యోగమే అసలు పరీక్ష
సివిల్స్‌లో విజయం సాధించిన అభ్యర్థులకు ఉద్యోగ బాధ్యతలే అసలైన పరీక్షలా ఉంటాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు వ్యాఖ్యానించారు.
సివిల్స్ ర్యాంకర్లతో మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: సివిల్స్‌లో విజయం సాధించిన అభ్యర్థులకు ఉద్యోగ బాధ్యతలే అసలైన పరీక్షలా ఉంటాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు వ్యాఖ్యానించారు. ప్రజల ఆకాంక్షలకు తగ్గట్లు అధికారులు పనిచేయాలని సూచించారు. సివిల్స్‌లో ర్యాంకులు సాధించిన 20 మంది బుధవారం మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఈ సందర్భంగా ర్యాంకర్లను మంత్రి అభినందించారు. ప్రభుత్వం, పరిపాలన, రాజకీయాలు, ప్రజల ఆకాంక్షలు వంటి అంశాలపై తన ఆలోచనలను వారితో పంచుకున్నారు. ఇక కేటీఆర్‌తో భేటీ పట్ల ర్యాంకర్లు ఆనందం వ్యక్తం చేశారు. ఆయన సలహాలు, సూచనలు తమకు దిశానిర్దేశం చేసే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. సివిల్స్ పరీక్షల సంసిద్ధత కోసం తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.