ఇప్పటివరకు ఇచ్చింది రూ. 8,600 కోట్లే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరువు పరిస్థితులు కమ్ముకుని, రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సమయంలో... యుద్ధ ప్రాతిపదికన వారికి రుణాలు అందించి ఆదుకోవాల్సిన బ్యాంకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వం పంట రుణాల మాఫీ కోసం 25 శాతం నిధులను విడుదల చేసి... విరివిగా కొత్త రుణాలు ఇవ్వాలని ఆదేశించినా ఫలితం లేదు. రుణ మాఫీ ప్రక్రియను ఇంకా పూర్తిచేయలేదు. మొత్తంగా రైతులకు ఇప్పటివరకు రూ. 8,600 కోట్ల కొత్త రుణాలను మాత్రమే ఇచ్చాయి. మొత్తం ఖరీఫ్ లక్ష్యంలో ఇది 69.41 శాతమే కావడం గమనార్హం.
గత నెలాఖరుకే రుణమాఫీ ప్రక్రియను పూర్తిచేసి ఖరీఫ్ రుణాల లక్ష్యాన్ని పూర్తిచేయాలని చెప్పినా.. బ్యాంకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో దీనిపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. బ్యాంకర్లతో తాజాగా సమావేశమైన రుణమాఫీ కమిటీ సభ్యులు... కొన్ని బ్యాంకులు సహకరించడం లేదని తేల్చిచెప్పారు. గ్రామీణ వికాస్ బ్యాంక్, కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర బ్యాంకులు చాలా ఆలస్యం చేస్తున్నాయని, ఆంధ్రాబ్యాంకు, ఎస్‌బీహెచ్ మాత్రమే వేగంగా కొత్త రుణాలు ఇస్తున్నాయని వ్యవసాయశాఖ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి చెప్పారు. ఈ నెలాఖరు నాటికైనా లక్ష్యం చేరుకోవాలని ఆయన బ్యాంకర్లను కోరారు. ఇప్పటివరకు ఇచ్చిన కొత్త రుణాల వివరాలను ఆయన జిల్లాల వారీగా ప్రకటించారు.
నత్తనడకన రైతు రుణాలు
Published Wed, Nov 19 2014 1:56 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement