అంతరించిపోతున్న ఊర పిచ్చుక పక్షి జూతులను కాపాడేందుకు బ్యాక్‌లాక్ సంష్థ డెరైక్టర్ రజనీ చేస్తున్న ప్రయత్నం అభినందనీయం అని రాష్ట్ర భారిపరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణరావు అన్నారు. ఆదివారం ఆయన అత్తాపూర్ హైదర్‌గూడ ఆంబియన్స్‌ఫోర్టు కాలనీలో నిర్వహించిన ఊరపిచ్చుకల దినోత్సవంలో పాల్గోన్నారు. ఈ సందర్బంగా పిచ్చుకల కోసం ప్రత్యేక గూళ్ళు తయారు చేయించి కాలనీలోని అన్ని చెట్లకు అమర్చారు. పక్షులకు కాలవాల్సిన నీరు, ఆహరం కోసం చిరుదాన్యాలను ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిదిగా హజరైనా మంత్రి జ్యూతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పక్షుల చిత్రాలను తీసి ఏర్పాటు చేసి ఫోటోగ్రఫిషోను ఆయన పరీశీలించారు. ఈ కార్యక్రమం సందర్బంగా నిర్వాహకులు తోలుబొమ్మల ఆట ద్వారా ఆకరిపిచ్చుక అనే నాటాకాన్ని చేశారు.
అనంతరం సమావేశంలో మంత్రి జూపల్లి కృష్షరావు మాట్లాడుతూ... ప్రస్తుత రోజుల్లో రేడియోషన్, కాలస్‌యం, చెట్లను నరికివేయడం కారణంగా పిచ్చుకలు అంతరించి పోతున్నాయన్నారు. అలాంటి సమయంలో పక్షి ప్రేమికురాలు రజనీ పిచ్చుకల సంరక్షణకోసం చేస్తున్న ప్రయత్నాలు, ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తున్నాయని, ఆమె చేసే ప్రయత్నానికి ప్రతి ఒక్కరు మద్దతు పలకాలన్నారు.
ఒక్క కాలనీలోనే కాకుండా భయట పాఠశాలలు, పార్కు ప్రాంతాలలో పక్షుల కోసం గూళ్ళను ఏర్పాటు చేయడం వలన ఈ ప్రాతంలో పక్షులు కనిపిస్తున్నాయని అభిప్రాయ పడ్డారు. ఎప్పుడు తాను చిన్నప్పుడు చూసి పక్షిని ఈ రోజు చూశానని ఆంభియన్స్‌షోర్టు కాలనీలో చాల రకాల పక్షులు ఉండటానికి కారణం రజని అని ఆయన పేర్కోన్నారు. ప్రతి ఒక్కరు తమ ప్రాంతంలో పిచ్చుకల కోసం చిరు గూళ్ళను ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పక్షుల సంక్షరణకోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుందన్నారు.