తాళం వేసి ఉన్న ఇంట్లో ప్రవేశించిన దుండగులు పెద్ద మొత్తంలో సొత్తును ఎత్తుకుపోయారు. మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడ లలితానగర్‌లో జరిగిన ఈ చోరీపై పోలీసుల కథనం.. డీఆర్‌డీఏ ఉద్యోగి చిత్తలూరి చంద్రశేఖర్‌గుప్త కుటుంబం లలితానగర్‌లో నివాసం ఉంటోంది, చంద్రశేఖర్ కుటుంబం, బంధువులతో కలసి గురువారం తిరుపతి వెళ్లారు.
చంద్రశేఖర్‌కు చెందిన బంగారు నగలతో పాటు వారి బంధువుల బంగారు నగలను మొత్తం 15 తులాల బంగారు ఆభరణాలు, రూ.50 నగదును చంద్రశేఖర్ ఇంట్లోని బీరువాలో ఉంచి తిరుపతి వెళ్ళారు. ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించిన దొంగలు గురువారం రాత్రి ఇంట్లోకి ప్రవేశించి బీరువాలో ఉన్న నగలు, నగదును తస్కరించారు. శుక్రవారం ఉదయం పొరుగు వారు గమనించి బాధితులకు సమాచారం అందించారు. ఈ మేరకు బాధితుల బంధువులు మీర్‌పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని ఆధారాలు సేకరించారు.