సాక్షి, హైదరాబాద్: దేశంలో గుణాత్మక మార్పు కోసం ఫెడరల్ ఫ్రంట్‌ను ప్రకటించిన సీఎం కేసీఆర్ దాన్ని విస్తరించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నా రు. అందుకు మే 10న ‘రైతు బంధు’ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వేదికగా చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోపాటు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలను హైదరాబాద్‌కు ఆహ్వానించారు.
కర్ణాటక, జార్ఖండ్ మాజీ ముఖ్యమం త్రులు కుమారస్వామి, హేమంత్ సోరెన్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తనయుడు, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ తదితరులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.
రాష్ట్రంలో జరిగే వివిధ కార్యక్రమాలకు నాలుగైదు రాష్ట్రాల నేతలను ఒకే వేదికపైకి తెచ్చి అంతర్గత చర్చలకు అవకాశం కల్పి స్తే ఫ్రంట్‌కు బలమైన పునాదులు పడతాయని, దాంతోపాటు రాష్ట్రంలోని అభివృద్ధి పనులకు జాతీయ స్థాయిలో ప్రచారం జరుగుతుందని కేసీఆర్ భావిస్తున్నట్టు టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 12న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున కుమారస్వామి హాజరు కాకపోవచ్చని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment