
ఈ ఏడాది నుంచి హాస్టళ్లలో బయోమెట్రిక్
హాస్టళ్లల్లో బోగస్ అడ్మిషన్లను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
మంత్రి జోగు రామన్న వెల్లడి
సాక్షి , హైదరాబాద్: హాస్టళ్లల్లో బోగస్ అడ్మిషన్లను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. బయోమెట్రిక్ హాజరు పద్ధతిని ఈ ఏడాది నుంచి పాఠశాలలు, క ళాశాల హాస్టళ్లలోనూ తప్పనిసరి చేస్తోంది. అర్హులైన విద్యార్థులకు అన్యాయం జరగకుండా అడ్మిషన్లలో అవకతవకలను నివారించేందుకు బయోమెట్రిక్ విధానాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని రాష్ర్ట మంత్రి జోగు రామన్న అధికారులను ఆదేశించారు.
గురువారం జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారులు, డీడీలు, ఇంజనీరింగ్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. స్కూళ్ల హాస్టల్ విద్యార్థుల మాదిరిగానే కళాశాల హాస్టళ్లలోనూ ఆన్‌లైన్ ద్వారా రిజస్ట్రేషన్లు నిర్వహించాలని అధికారులకు సూచించారు.