టిప్పర్‌ను ఢీకొట్టిన ఆర్టీసి బస్సు | Tipper RTC bus collided | Sakshi
Sakshi News home page

టిప్పర్‌ను ఢీకొట్టిన ఆర్టీసి బస్సు

Published Thu, Aug 25 2016 6:05 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

Tipper RTC bus collided

- పది మందికి గాయాలు
పెద్దఅంబర్‌పేట
 రోడ్డు మలుపు తిరుగుతున్న టిప్పర్‌ను వెనుక నుంచి వచ్చిన ఆర్టీసి బస్సు ఢీ కొట్టడడంతో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 10మంది ప్రయాణికులకు గాయాలైన సంఘటన హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం నల్గొండ జిల్లా సూర్యాపేట డిపోకు చెందిన ఆర్టీసి బస్సు (ఏపీ24జెడ్105) గురువారం హైదరాబాద్ వైపు నుంచి సూర్యాపేటకు వెళ్తున్న క్రమంలో విజయవాడ జాతీయ రహదారిపై బాటసింగారం గ్రామం మౌంట్‌ఓపేరా వద్ద రాగానే ముందుగా వెళ్తున్న టిప్పర్ ఏపీ29వీ0826 రోడ్డు మలుపు తిరుగుతుండగా ఆర్టీసి బస్సు ఢీ కొట్టింది. ఈ సంఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 10మందికి స్వల్ప గాయాలు కావడంతో స్థానికులు, పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement