రోడ్డు పక్కన నడిచి వెళ్తున్న వారిపై ఆర్టీసీ బస్సు దూసుకెళ్లిన ఘటనలో ఒకరు మృత్యువాతపడ్డారు.
రోడ్డు పక్కన నడిచి వెళ్తున్న వారిపై ఆర్టీసీ బస్సు దూసుకెళ్లిన ఘటనలో ఒకరు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన అంబర్‌పేట చౌరస్తాలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ఘటనకు నిరసనగా కొందరు రాస్తారోకోకు దిగటంతో పెద్ద ఎత్తున రాకపోకలు స్తంభించిపోయాయి. ట్రాఫిక్‌లో చిక్కుకున్న వారిలో పదో తరగతి విద్యార్థులు కూడా ఉన్నారు. పరీక్ష సమయం సమీపిస్తుండటంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.