
నేడు రేపు మోస్తరు.. తర్వాత భారీ వర్షాలు
రుతుపవనాలు ఊపందుకోవడంతో మంగళ, బుధవారాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇదిలావుండగా గత 24 గంటల్లో సారంగాపూర్, బాన్సువాడ, లింగంపేట్, నాగరెడ్డి పేట్, ఎల్లారెడ్డి, తాడ్వాయిలలో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మరికొన్నిచోట్ల ఒక సెంటీమీటర్ చొప్పున వర్షం కురిసింది.