ప్రమాదాల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీస్‌శాఖ అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది.
ప్రమాదాలు జరగకుండా నిబంధనలు పాటించండి: పోలీస్ శాఖ
సాక్షి, హైదరాబాద్: రోడ్డు భద్రత వారోత్స వాల్లో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు, ప్రమాదాల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీస్‌శాఖ అవగాహన కార్య క్రమాలు చేపడుతోంది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా యాక్సిడెంట్ ఫ్రీ డేగా పా టించాలని వాహనదారులను కోరింది. రాష్ట్రంలో ఏటా రోడ్డు ప్రమాదాల్లో 7వేల మంది మృత్యువాత పడుతున్నారని.. వీరి లో ద్విచక్ర వాహనదారులు, పాదాచారులే 50 శాతానికి పైగా ఉంటున్నారని పేర్కొంది.
యువకులే అధికంగా ప్రాణాలు కోల్పో తున్నారని, ప్రమాదాలు జరుగకుండా మంగళవారం యాక్సిడెంట్ ఫ్రీ డేగా పా టించాలని డీజీపీ అనురాగ్‌శర్మ, రోడ్ సేఫ్టీ అదనపు డీజీపీ కృష్ణప్రసాద్ చెప్పారు. రాష్ట్రంలో ప్రమాదాలు, మృతుల సంఖ్య తగ్గేలా ప్రతి ఒక్కరూ కృషిచేయాలని కోరారు.