నేడు, రేపు భారీ వర్షాలు
వాతావరణ కేంద్రం వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రుతుపవనాలు ఊపందుకో వడంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురు స్తున్నాయని... ఆది, సోమవారాల్లోనూ వానలు పడ తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలి పింది. అక్కడక్కడా భారీ వర్షాలు నమోదవుతా యని వెల్లడించింది. అనంతరం రెండుమూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి చెప్పారు. కాగా గత 24 గంటల్లో మాచా రెడ్డి, సదాశివనగర్‌లలో 12 సెంటీమీటర్లు, హైదరా బాద్, హకీంపేటల్లో 11 సెంటీమీటర్ల చొప్పున భారీ వర్షపాతం నమో దైంది. లింగంపేట, ఇబ్రహీం పట్నం, డిచ్‌పల్లి, ఆదిలాబాద్, గోల్కొండల్లో 9.. సరూర్‌నగర్, శేరిలింగంపల్లి, గాంధారి, హయత్ నగర్‌లలో 8.. నిజామాబాద్, మెదక్, మోమిన్‌పేట, రెంజల్, ఎల్లారెడ్డి, సంగారెడ్డి, మెట్‌పల్లిలలో 7 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.
పలు జిల్లాల్లో లోటే..
రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నా పలు జిల్లాల్లో మాత్రం ఇంకా లోటు వర్షపాతమే కొనసాగుతోంది. పాత ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఇప్పటికీ 23 శాతం లోటు ఉంది. మహబూబ్‌నగర్ 20 శాతం, కరీంనగర్, నిజామాబాద్‌లలో 16 శాతం చొప్పున లోటు వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో మాత్రం 17 శాతం అధిక వర్షపాతం నమోదు కావడం గమనార్హం. ఇక భారీ వర్షాలు కురుస్తుండటంతో కొన్నిచోట్ల పత్తిని పట్టి పీడిస్తున్న గులాబీ రంగు కాయతొలుచు పురుగు నశించిపోతుందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. అన్ని మెట్ట పంటలకు ఈ వర్షాలు ప్రయోజనం చేకూర్చాయని చెబుతున్నారు. చెరువులు, కుంటలు, జలాశయాలు నిండినచోట వరి నాట్లు ఊపందుకుంటాయని వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి పేర్కొన్నారు.