రేపు ఓపెన్‌ స్కూల్‌ ప్రవేశాల నోటిఫికేషన్‌ | Tomorrow Open School Entry Notification | Sakshi
Sakshi News home page

రేపు ఓపెన్‌ స్కూల్‌ ప్రవేశాల నోటిఫికేషన్‌

Published Wed, Aug 16 2017 3:34 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

Tomorrow Open School Entry Notification

వచ్చే నెల 14వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ
 
సాక్షి, హైదరాబాద్‌: దూర విద్యా విధానంలో ఓపెన్‌ ఎస్సెస్సీ, ఇంటర్మీడియెట్‌లో ప్రవేశాల కోసం ఈ నెల 17న నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. 2017–18 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు గాను ఈ నెల 17 నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిం చనున్నట్లు ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ వెల్లడించింది. అభ్యర్థులు మీసేవా/టీఎస్‌ ఆన్‌లైన్‌/ఏపీ ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి నమోదు చేసుకోవాలని, దరఖాస్తు ఫారాన్ని అప్‌లోడ్‌ చేయాలని సూచించింది.

వచ్చే నెల 4వ తేదీలోగా ఫీజు చెల్లించాలని పేర్కొంది. ఆలస్య రుసుముతో వచ్చే నెల 5వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని, వారంతా మీసేవా ద్వారా మాత్రమే వచ్చే నెల 21వ తేదీలోగా దరఖాస్తులను పంపించాలని వెల్లడించింది. పూర్తి వివ రాలు జిల్లాల్లోని డీఈవో కార్యాలయాలు లేదా telanganaopenschool.org వెబ్‌సైట్‌లో పొందవచ్చని వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement