సాక్షి, హైదరాబాద్: ప్రాజ్టెక్టులన్నీ ఎండిపోయి కరువుతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు. టీడీపీ నాయకులను తమ పార్టీలో చేర్చుకోవడమే టీఆర్‌ఎస్ పనిగా ఉందన్నారు. ఆదివారం ఎన్టీఆర్ భవన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కోటి ఎకరాలకు నీరిందించడమంటే ఇంతకు ముందు న్న ప్రాజెక్టుల కింద సాగువుతున్న 70లక్షల ఎకరాలను కూడా కలుపుకుంటారా.. లేదంటే మీ ప్రభుత్వ హయాంలో చేపట్టినప్రాజెక్ట్‌ల ద్వారానే ఇస్తారా అని ప్రశ్నించారు.
ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ ప్రాజెక్ట్ హోదాను తెస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్న టీఆర్‌ఎస్ నేతలు ఇప్పడు ప్రాణహిత బోగస్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. మహారాష్ట్ర ఒత్తిళ్లకు సీఎం కేసీఆర్ త లొగ్గి తమ్మడిహెట్టి ఎత్తును 148 మీటర్లకు తగ్గించారని రావుల పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లవుతున్నా రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టును కూడా ఎందుకు ప్రారంభించలేకపోయిందని ప్రశ్నించారు.
కరువు పట్టించుకోని టీఆర్‌ఎస్: రావుల
Published Mon, Apr 11 2016 1:17 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement