తెలంగాణలో హైడల్‌ విద్యుత్పత్తి | TRS Minister Jagadish Reddy On Power Usage In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో హైడల్‌ విద్యుత్పత్తి

Published Sat, Mar 18 2017 12:02 PM | Last Updated on Sat, Aug 11 2018 6:42 PM

TRS Minister Jagadish Reddy On Power Usage In Telangana

హైదరాబాద్ : తెలంగాణలో హైడల్ విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఉదయం ప్రశ్నోత్తరాల సందర్భంగా శాసనసభలో మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం 2,400 మెగావాట్ల జలవిద్యుత్ అందుబాటులో ఉందని, అన్ని వనరులు ఉపయోగించి హైడల్ విద్యుత్ ఉత్పత్తి చేస్తామన్నారు. ప్రాజెక్టుల్లో తక్కువ ఖర్చుతో పారదర్శకంగా బిడ్డింగ్ ద్వారా వెళ్తున్నామని పేర్కొన్నారు. ఏడాది చివరిలోపు 2 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ సామర్థ్యాన్ని కలిగి ఉంటామని తెలిపారు. సోలార్ విద్యుత్‌లో తెలంగాణ నెంబర్‌వన్‌గా ఉందని స్పష్టం చేశారు. వీలైనంత తక్కువ ధరకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు యత్నిస్తున్నామని చెప్పారు. యాదాద్రి విద్యుత్ కేంద్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేది లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement