అఫ్జల్‌గంజ్ (హైదరాబాద్): హైదరాబాద్‌లోని అన్ని ఆర్టీసీ డిపోల పరిధిలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) హైదరాబాద్ రీజినల్ మేనేజర్ (ఆర్‌ఎం)గా బాధ్యతలు చేపట్టిన ఎం. వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ (ఎంజీబీఎస్) లోని తన కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు.
ఇక్కడ రీజినల్ మేనేజర్‌గా పని చేసిన వెంకటేశ్వరరావు ఆదిలాబాద్ జిల్లా ఆర్‌ఎంగా బదిలీ అయ్యారు. దీంతో బస్‌భవన్‌లో మార్కెటింగ్ అండ్ కమర్షియల్ విభాగంలో చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్‌రెడ్డిని హైదరాబాద్ ఆర్‌ఎంగా బదిలీ చేశారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని ఆయన చెప్పారు.
'ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి కృషి'
Published Wed, Sep 2 2015 6:19 PM | Last Updated on Sun, Sep 3 2017 8:37 AM
Advertisement
Advertisement