గిరిజనుల ఆత్మగౌరవానికి దెబ్బ
కేసీఆర్ పాలనపై ఉత్తమ్ ధ్వజం
హైదరాబాద్: కేసీఆర్ పాలనలో గిరిజనుల ఆత్మగౌరవం దెబ్బతిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమ లు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగా ల్లో దళితులకు, గిరిజనులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో స్పష్టం చేయాలన్నారు. ఆదివారం ఇక్కడ జరిగిన గిరిజన విద్యార్థి జేఏసీ సదస్సులో ఉత్తమ్ మాట్లాడుతూ అధికా రంలోకి వచ్చి మూడు సంవత్సరాలు దాటిన తర్వాత ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు.
టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే ఉద్యోగాలు వస్తాయని నమ్మిన గిరిజనులను సీఎం కేసీఆర్ మోసం చేశారన్నారు. సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణ మాట్లాడు తూ అనేక పోరాటాలతో గిరిజనులు సాధించుకున్న హక్కుల ను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయన్నారు. గ్రీన్ హంట్ అని ముద్దుపేరు పెట్టి నక్సలైట్ల పేరుతో గిరిజనులను హింసిస్తున్నారన్నారు. గిరిజనులకు, ముస్లింలకు రిజర్వేష న్ కల్పిస్తామని సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారన్నారు. గిరిజన విద్యార్థి జేఏసీ నాయకులు విష్ణుచవాన్, వెంకటేశ్ చవాన్, మాజీ ఎంపీ రవీంద్రనాయక్, మాజీ ఎమ్మెల్సీ దిలిప్‌కుమార్, చెరుకు సుధాకర్, మాజీ మంత్రి అమర్ సింగ్‌తిలావత్, లంబాడా హక్కుల పోరాట సమితి అధ్య క్షుడు బెల్లయ్యనాయక్, దాసురాం నాయక్ పాల్గొన్నారు.