
నమ్మకముంటే మంత్రి పదవికి రాజీనామా చేసి..
పాలేరు ఉప ఎన్నికలో గెలుస్తానని నమ్మకముంటే... మంత్రి పదవికి, ఎమ్మెల్సీకి రాజీనామా చేసి పోటీలో కొనసాగాలని టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి సవాల్ విసిరారు.
హైదరాబాద్ : పాలేరు ఉప ఎన్నికలో గెలుస్తానని నమ్మకముంటే... మంత్రి పదవికి, ఎమ్మెల్సీకి రాజీనామా చేసి పోటీలో కొనసాగాలని టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి సవాల్ విసిరారు. మంగళవారం హైదరాబాద్లో ఉత్తమ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ... నాడు కరీంనగర్ లోక్సభ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన జీవన్రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేశారని ఉత్తమ్కుమార్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలకు నిధులు లేవంటున్న కేసీఆర్... కమిషన్లు వచ్చే సాగునీటి ప్రాజెక్టుల అంచనాలను మాత్రం వేలకోట్లకు పెంచుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ విధానాల వల్ల విద్యావ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని ఉత్తమ్కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.