అప్రజాస్వామిక చర్యలకు పరాకాష్ట
రాహుల్‌పై దాడి నీచం: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీపై గుజ రాత్‌లో బీజేపీ నేతలు భౌతిక దాడులకు పాల్పడటం ప్రధాని మోదీ అప్రజాస్వామిక పాలనకు పరాకాష్ట అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. గుజరాత్, రాజస్తాన్‌లో తీవ్రమైన వరదలు, భారీ వర్షాలతో ప్రజలు కష్టాలు పడుతున్నారని, వరద ప్రాంతాల్లో రాహుల్ పర్యటించి, బాధితు లను పరామర్శించడానికి వెళ్లారని పేర్కొ న్నారు. గుజరాత్‌లోని బనస్కంత్‌లో పర్య టిస్తున్న సందర్భంగా బీజేపీ కార్యకర్తలు దాడులకు దిగారన్నారు.
జాతీయ పార్టీ ఉపాధ్యక్షుడు, దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన కుటుంబానికి చెందిన రాహుల్‌పైనే బీజేపీ నేతలు, కార్య కర్తలు తెగబడటం అత్యంత నీచమన్నారు. దాడులకు బాధ్యత వహించి ప్రజలకు ప్రధాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.