స్వలాభం కోసమే పార్టీ వీడారు..
వలసలపై రాహుల్, దిగ్విజయ్‌కు ఉత్తమ్ నివేదన
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మరో శాసనసభ్యుడు భాస్కర్‌రావు, మాజీ ఎంపీ జి.వివేక్, మాజీ మంత్రి జి.వినోద్ తదితరులు స్వలాభం కోసమే పార్టీని వీడారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌కు వివరణ ఇచ్చారు. మంగళవారం ఆయన ఇక్కడ వారిరువురినీ కలసి వలసలపై నివేదించారు. అధిష్ఠానం పిలుపు మేరకే ఉత్తమ్ ఢిల్లీ వచ్చినట్టు సమాచారం. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా తమ పోరాటంలో ఎలాంటి వైఫల్యమూ లేదని, పార్టీ మారిన నేతలు కాంట్రాక్టులు, ఇతర పదవులను ఆశించి అధికార పార్టీలో చేరారని ఉత్తమ్ వివరణ ఇచ్చినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. తాజా పరిణామాలపై రాహుల్‌గాంధీ, దిగ్విజయ్‌తో చర్చించానని తెలిపారు. వలసల వల్ల పార్టీకి నష్టమేమీ లేదని, పదవుల కోసం కాకుండా పార్టీ శ్రేయస్సు కోసం పనిచేసే వారికి తమ మద్దతు ఎప్పటికీ ఉంటుందని రాహుల్ చెప్పారన్నారు. బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించే పీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో దిగ్విజయ్, కుంతియా, ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు పాల్గొననున్నట్టు తెలిపారు.
నేడు టీపీసీసీ సమన్వయ కమిటీ భేటీ
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం గాంధీభవన్‌లో బుధవారం జరగనుంది. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్రపార్టీ వ్యవహారాల ఇన్‌చార్జీలు దిగ్విజయ్‌సింగ్, రామచంద్ర కుంతియా, ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు పరిశీలకులుగా హాజరుకానున్నారు. పార్టీ సంస్థాగత అంశా లు, అంతర్గత విషయాలపై మాత్రమే చర్చ ఉంటుందని టీపీసీసీ వర్గాలు చెబుతున్నా యి. అయితే రాష్ట్ర కాంగ్రెస్‌లో భారీ స్థాయి లో వలసలు, వలసలను నిరోధించడంలో రాష్ట్ర నాయకత్వ వైఫల్యంపై సమావేశంలో తీవ్రమైన నిర్ణయాలు ఉండే అవకాశముం దని పార్టీ నేతలు కొందరు అభిప్రాయ పడుతున్నారు.