'నా బిడ్డ మరణానికి వీసీనే కారణం' | vc apparao main accused in rohith death row says mother radhika | Sakshi
Sakshi News home page

'నా బిడ్డ మరణానికి వీసీనే కారణం'

Published Mon, Mar 28 2016 4:08 PM | Last Updated on Sun, Sep 3 2017 8:44 PM

'నా బిడ్డ మరణానికి వీసీనే కారణం'

'నా బిడ్డ మరణానికి వీసీనే కారణం'

హైదరాబాద్: రోహిత్ వేముల మరణానికి వీసీ అప్పారావే కారణమని తల్లి రాధిక అన్నారు. వీసీ చర్యలను వ్యతిరేకిస్తే విద్యార్థులను అరెస్ట్ చేస్తారా..? అని మండిపడ్డారు. హెచ్‌సీయూలో వీసీ అప్పారావు మళ్లీ విధులకు హాజరై ఉద్దేశపూర్వకంగానే విద్యార్థులను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు.   

మరోవైపు హెచ్సీయూలో అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితులు చక్కదిద్దేందుకు యూనివర్సిటీ స్థాయి కమిటీని వేశారు. రోహిత్ ఆత్మహత్య ఘటన అనంతరం కొనసాగుతున్న ఆందోళనను విరమింపజేసి తిరిగి యధాస్థితికి తెచ్చేందుకు ఏమేం చర్యలు తీసుకోవాలో తెలియజేసేందుకు ప్రొఫెసర్ కామయ్య చైర్మన్ గా ఏడుగురితో కమిటీని వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement