పర్యవేక్షిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మళ్లీ వెలుగుచూసిన పోలియో వైరస్‌ను అరికట్టేందుకు వైద్య, ఆరోగ్య శాఖ నడుం బిగిం చింది. అంబర్‌పేట, నాగోలులోని మురుగు నీటి శుద్ధి ప్లాంట్లలో ఇటీవల టైప్-2 వ్యాక్సిన్ వైరస్ బయటపడటంతో అప్రమత్తమైన వైద్య, ఆరోగ్య శాఖ.. వ్యాక్సిన్ ఎక్కడెక్కడుందో కనుగొనేందుకు 200 బృందాలను నియమించింది. మొత్తం 800 మంది ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను జల్లెడ పడుతున్నారు. ప్రపంచ ఆరో గ్య సంస్థ అధికారులు కూడా ఈ బృందాలను పర్యవేక్షిస్తున్నారు.
కొందరు ఆ బృందాలతో పర్యటిస్తున్నారు. శుక్రవారం రెండు ప్రైవేటు నర్సింగ్‌హోంలలో వైరస్ ఉన్న వ్యాక్సిన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో మూడు నాలుగు రోజులపాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిం చి నగరంలోని అన్ని ఆస్పత్రులనూ పరిశీలిస్తామని జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ప్రత్యేకాధికారి డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. గత నెల 28వ తేదీన అంబర్‌పేట, నాగోలులోని మురుగు నీటి శుద్ధి ప్లాంట్ల నుంచి శాంపిళ్లను సేకరించి ముంబైలోని ఈఆర్‌ఎస్ లేబొరేటరీకి పరీక్షలకు పంపగా రెండు చోట్ల కూడా పోలియో వైరస్ ఉన్నట్లు తేలింది.
200 బృందాలతో పోలియోపై సమరం
Published Sat, Sep 24 2016 12:37 AM | Last Updated on Mon, Sep 4 2017 2:40 PM
Advertisement
Advertisement