సాక్షి, హైదరాబాద్: ఎగువ నుంచి కొనసాగుతున్న ప్రవాహాలతో శ్రీశైలంలో నీటి నిల్వలు పెరిగాయి. బుధవారం నాటికి శ్రీశైలం నీటి మట్టం 50 టీఎంసీలు దాటింది. జూరాల నుంచి 37 వేల క్యూసెక్కుల మేర వరద వస్తుండటంతో ప్రాజెక్టులో ప్రస్తుత మట్టం 51.23 టీఎంసీలకు చేరింది. కృష్ణా బోర్డు ఆదేశాల మేరకు హైదరాబాద్ తాగునీటికి శ్రీశైలం నుంచి 10 వేల క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు పూర్తిగా నిండటంతో దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది.
ఆల్మట్టిలోకి 12 వేల క్యూసెక్కుల మేర వరద వస్తుండగా, వచ్చిన నీటిని దిగువ నారాయణపూర్‌కు విడుదల చేశారు. నారాయణపూర్‌లోకి 11,350 క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లో కొనసాగుతుండటం వల్ల ప్రాజెక్ట్ పూర్తిగా నిండటంతో నీటిని దిగువకు విడుదల చేశారు. నారాయణపూర్ నుంచి వస్తున్న ప్రవాహానికి తోడు ప్రాజెక్టు పరివాహకంలో కురుస్తున్న వర్షాలతో జూరాలకు 37,073 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ప్రస్తుతం జూరాలలో 9.11 టీఎంసీల నిల్వలు ఉండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువ శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు.
శ్రీశైలంలో పెరిగిన నీటి మట్టం
Published Thu, Sep 14 2017 2:58 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
Advertisement
Advertisement