
వెస్ట్...టైర్ర'రెస్ట్'
విజయవాడకు చెందిన చలసాని పండు హత్య, అనంతపురానికి చెందిన మద్దెలచెర్వు సూరి మర్డర్, పల్లంరాజు కేంద్ర మంత్రిగా ఉండగా ఆయన సమీప బంధువు హత్య...
* వీఐపీ జోన్‌లోనే టై డెన్స్
* సంచలనాలకూ కేరాఫ్ అడ్రస్
* కలిసి వస్తున్న అనేక అంశాలు
* అప్రమత్తమైన నిఘా విభాగం
సాక్షి, సిటీబ్యూరో: విజయవాడకు చెందిన చలసాని పండు హత్య, అనంతపురానికి చెందిన మద్దెలచెర్వు సూరి మర్డర్, పల్లంరాజు కేంద్ర మంత్రిగా ఉండగా ఆయన సమీప బంధువు హత్య... ఇవన్నీ నగరంలోని వెస్ట్‌జోన్ పరి ధిలోనే జరిగాయి. కేవలం ఈ తరహా సంచలనాలు మాత్రమే కాదు... ఉగ్రవాదులకు ఈ జోన్ ఓ డెన్‌గా మారిపోయింది.
నగరంలోని తొలి సంచలనాత్మక టై ఉదంతమైన అదనపు ఎస్పీ కృష్ణప్రసాద్ హత్య నుంచి శుక్రవారం చిక్కిన నలుగురు ఐసిస్ అనుబంధ సంస్థ జుందుల్-అల్-ఖలీఫా-అల్-హింద్ ఉగ్రవాదుల అరెస్టు వరకు పరిశిలిస్తే ఇక్కడ ‘రెస్ట్’, ‘హోస్ట్’ చేసిన ఉగ్రవాదులు ఎందరో ఉన్నారు. పశ్చిమ మండలం ఈ రకంగా మారడానికి ఎన్నో కారణాలున్నాయి. తాజాగా శుక్రవారం టోలిచౌకి, మాదాపూర్ ప్రాంతాల్లో నఫీజ్ ఖాన్, ఒబేదుల్లా ఖాన్, షరీఫ్ మొయినుద్దీన్ ఖాన్, అబు అనాజ్ అరెస్టులతో అప్రమత్తమైన నిఘా, పోలీసు విభాగాలు ఈ మండలంపై ప్రత్యేక దృష్టి పెట్టాయి.
కలిసి వస్తున్న అంశాలెన్నో...
నగర కమిషనరేట్ పరిధిలో ఉన్న ఐదు జోన్లలో పశ్చిమ మండలానిది ప్రత్యేక స్థానం. రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా నగర వ్యాప్తంగా ఉన్న వీఐపీల్లో 80 శాతం దీని పరిధిలోనే ఉంటారు. మరోపక్క నగరంలో ఉన్న లెసైన్డ్స్ ఆయుధాల్లో మూడోంతులు ఇక్కడే ఉన్నా యి. ఇలాంటి వీఐపీ జోన్‌లో ముష్కరులు తలదాచుకోవడానికీ ఉపకరించే అనేక అంశాలున్నాయి. ఖరీదైన ప్రాంతాలతో పాటు మధ్య తరగతి ప్రజలు నివసించే కాల నీలు, సామాన్యులు ఉండే బస్తీలు సైతం ఈ మండలంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏ తరహాకు చెందిన వారైనా ఇక్కడ తేలిగ్గా ఆశ్రయం పొందే అవకాశం ఉంటోం ది. దీన్ని ఆసరాగా చేసుకున్న ముష్కరులు ‘రెస్ట్’, ‘హోస్ట్’ కోసం ఈ మండలాన్ని వాడుతున్నారు.
విద్య, ఉద్యోగ కారణాలు చూపిస్తూ...
పశ్చిమ మండల పరిధిలో విద్యాకేంద్రాలు సైతం ఉంటున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో సాఫ్ట్‌వేర్ సంబంధిత వ్యాపార, ఉద్యోగ సంస్థలు ఎన్నో ఉన్నాయి. వీటికితోడు అమీర్‌పేట్, ఎస్సార్‌నగర్ తదితర ప్రాంతా లు విద్యా సంస్థలకు పెట్టింది పేరు. అకడమిక్ విద్యతో పాటు సాంకేతిక విద్యనూ బోధించే చిన్నాపెద్ద సంస్థలు అనేకం ఇక్క డ ఉన్నాయి. ఐటీ హబ్‌గా ఉన్న మాదాపూర్ ఆ చుట్టుపక్కల ప్రాంతాలున్న సైబరాబాద్ సైతం దీనికి సరిహద్దుగా ఉండటం మరో అనుకూలాంశం. వీటికీ తమకు అనుకూలంగా మార్చుకుంటున్న ముష్కరులు ఆయా సంస్థల్లో విద్యనభ్యసించడం, ఉద్యోగాలు చేయడం వంటి అంశాలతో పాటు ఆ ముసుగులోనూ తలదాచుకుంటున్నారు. వెస్ట్‌జోన్ పరిధిలో దాదాపు అన్ని రాష్ట్రాలకూ చెందిన ప్రజలు వసలవచ్చి నివసిస్తుం డటంతో ఏ ప్రాంతానికి చెందిన వారైనా ఇక్కడ జీవనం సాగించడం తేలికగా మారిపోయింది.
మచ్చుకు కొన్ని ...
* టోలిచౌకిలోని బృందావన్‌కాలనీలో తలదాచుకున్న ముజీబ్ మాడ్యుల్‌ను పట్టుకోవడానికి వెళ్లిన అదనపు ఎస్పీ కృష్ణప్రసాద్, ఆయన గన్‌మెన్‌లు 1992లో హత్యకు గురయ్యారు.
* ఐసిస్‌తో లింకులున్నాయనే ఆరోపణలపై గతనెలలో డిపోర్టేషన్‌కు గురైన కెన్యా యువతి అమీనా నివసించింది టోలిచౌకి ప్రాంతంలోనే.
* 2007లో గోకుల్‌చాట్, లుంబినీ పార్క్‌ల్లో జంట పేలుళ్లకు పాల్పడిన ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు అమీర్‌పేటలోని ఓ సంస్థలో విద్యార్థులుగా ‘ముసుగు’ వేసుకున్నారు.
* ఇదే ఉగ్రవాద సంస్థకు చెందిన మన్సూర్ అస్ఘర్ పీర్భాయ్, ఎజాజ్ షేక్‌లు బంజారాహిల్స్‌లోని సాఫ్ట్‌వేర్ సంస్థలో ట్రైనింగ్ తీసుకుని, ఆ ప్రాంతంలోనే నివసించారు.
* గుజరాత్ పోలీసులకు మోస్ట్‌వాంటెడ్ అయిన గులాం జాఫర్ గులాం హుస్సేన్ ఫేక్ సుదీర్ఘకాలం హకీంపేటలోకి ఐఏఎన్ కాలనీలో టైలర్‌గా ‘అజ్ఞాతవాసం’ చేస్తూ గతేడాది చిక్కాడు.
* ఐసిస్‌లో చేరేందుకు వెళ్తూ గతేడాది శంషాబాద్ విమానాశ్రయంలో చిక్కిన సల్మాన్ మొహియుద్దీన్ హబీబ్‌నగర్‌లోని బజార్‌ఘాట్‌కు చెందిన వాడు.
* గతేడాది చిక్కిన ‘ఐసిస్ త్రయం’లో ఒకడైన మాజ్ హసన్ హుమాయున్‌నగర్‌కు చెందినవాడు.