
భర్తకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది
హిమాయత్‌నగర్: ప్రియుడితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న భార్యను భర్తే రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులకు పట్టించాడు. ఈ ఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గాంధీనగర్‌కు చెందిన ఓ మహిళను సంతోష్‌కుమార్ అనే వ్యక్తి 2009లో వివాహం చేసుకున్నాడు. అయితే, ఆమె పెళ్లికి ముందు ఎంబీఏ చదువుతున్న సమయంలో తన కళాశాల స్నేహితుడు విజయశేఖర్‌రెడ్డిని ప్రేమించింది. ప్రియుడ్ని కాదని, తల్లిదండ్రులు ఇష్టం లేని పెళ్లి చేశారని ఆమె అత్తారింటికి వెళ్లకుండా పుట్టింట్లోనే భర్తతో కాపురం పెట్టింది. మరోవైపు ప్రియుడితో రహస్య సంబంధం కొనసాగిస్తోంది.
విషయం తెలుసుకున్న భర్త సంతోష్ నిఘా వేసి, శనివారం నారాయణగూడలోని ఓ ఇంట్లో తన భార్య ఆమె ప్రియుడితో సన్నిహితంగా ఉండగా పోలీసులకు పట్టించాడు. పోలీసులు శేఖర్‌రెడ్డిపై కేసు నమోదు చేసి, అతడ్ని రిమాండ్‌కు తరలించారు.