గడప గడపకు వైఎస్సార్పై సమీక్షలు | ys jagan mohan reddy review meeting on Gadapa Gadapa Ku Ysr Program | Sakshi
Sakshi News home page

గడప గడపకు వైఎస్సార్పై సమీక్షలు

Published Sat, Dec 3 2016 12:57 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

గడప గడపకు వైఎస్సార్పై సమీక్షలు - Sakshi

గడప గడపకు వైఎస్సార్పై సమీక్షలు

హైదరాబాద్ : రాష్ట్రంలో చంద్ర‌బాబు రెండేళ్ల పాలన వైఫ‌ల్యాల‌తో పాటు ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమంపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు.

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని జూలై 8న ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. వైస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ అధ్యక్షతన ఈ నెల 5,6 తేదీల్లో సమీక్షా సమావేశాలు జరగనున్నాయి. రెండు రోజుల పాటు 13 జిల్లాల నేతలతో వైఎస్ జగన్ భేటీ అవుతారు. ఈ నెల 5న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల నేతలతో, 6న గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల నేతలతో ఆయన సమావేశమవుతారు. గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమంపై నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement